Site icon Prime9

Chikoti Praveen : బీజేపీలో చేరిన క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్.. కిషన్ రెడ్డి సమక్షంలో

casino king chikoti praveen joined in bjp

casino king chikoti praveen joined in bjp

Chikoti Praveen : క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. భాజపా నేత డికె అరుణ సమక్షంలో చికోటి ప్రవీణ్ పార్టీలో చేరగా.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని ఆయనకు కండువా కప్పారు. గత కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రవీణ్ జాయిన్ కావడాన్ని పార్టీలో ఒక వర్గం వ్యతిరేకించింది. ఇటీవల బీజేపీ ఆఫీస్‌కు తన అనుచరులతో వెళ్తే పార్టీలో చేర్చుకునేందుకు నేతలు నిరాకరించారు. కండువా కప్పేందుకు పార్టీ ఆఫీస్‌లో ఎవరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.

తాజాగా చికోటి ప్రవీణ్‌కు బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జోక్యంతో చీకోటికి లైన్‌ క్లియర్‌ అయ్యిందని సమాచారం. చికోటి ప్రవీణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే చీకోటి బీజేపీలో చేరాలనుకున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం గ్యాంబ్లింగ్ క్లబ్‌లు, క్యాసినోలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఆయనపై పలు క్రిమినల్ కూడా ఉండగా ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు.

Exit mobile version