Case Filed on BRS MLA HarishRao in Bachupally: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదైంది. చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని బాచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు సంతోష్ కుమార్, రాములు, వంశీలపై కూడా కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే హరీశ్ రావుపై 351(2), ఆర్‌డబ్ల్యూ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎఫ్‌ఐఆర్‌లో ఏ2గా హరీశ్ రావు పేరును పోలీసులు చేర్చారు. ఈ కేసులోనే ఏ1గా వంశీ, ఏ3గా సంతోష్ కుమార్, ఏ4గా పరుశరాములు పేర్లను చేర్చారు. అయితే మంత్రి హరీశ్ రావుతో పాటు ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, కొంతకాలంగా హరీశ్ రావు అనుచరులు ముగ్గురు బెదిరింపులకు పాల్పడుతున్నారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.