Site icon Prime9

MLC Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..

brs mlc kaushik reddy saved from road accident

brs mlc kaushik reddy saved from road accident

MLC Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న టూవీలర్‌ను తప్పించబోయి రోడ్డు పక్కన పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. నీటి కాలువలోకి వెళ్లి ఆగిపోయింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కౌశిక్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాద సమయంలో కారులోని ఎయిర్‌ బెలూన్స్ ఓపెన్ కావటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తర్వాత.. ఎస్కార్ట్ వెహికిల్ ఎక్కి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ వెళ్లిపోయారు. అయితే.. ప్రమాదానికి కారణమైన బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు కాగా.. అతణ్ని ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ఈరోజు జరిగిన 2K రన్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి హుజురాబాద్ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

Exit mobile version