BRS MLC Candidates: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించారు. దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామి రెడ్డి, కుర్మయ్యగారి నవీన్ కుమార్ లను బీఆర్ఎస్ అభ్యర్ధులుగా ఎంపికయ్యారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలు.. (BRS MLC Candidates)
రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులకు ఇదివరకే నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించారు. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిల పేర్లను వెల్లడించారు. ఈ నెల 9న బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా… రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలలో కలిపి 10 సీట్లకు గాను తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలుస్తుంది. కాగా ఇందుకు సంబంధించి మార్చి 6న నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా.. మార్చి 23న పోలింగ్, కౌంటింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 13గా ఈసీ నిర్ణయించింది.