BRS EX Minister KTR Big Relief In High Court of Telangana: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాగా, కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్‌లో ఉట్నూరు పీఎస్‌లో కేటీఆర్‌పై కేసు నమోదైంది.
అంతకుముందు మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ రూ.25వేల కోట్ల నిధులను తరలించిందంటూ కేటీఆర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కేటీఆర్ చేసిన ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలోనే గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో భాగంగానే ఈ కేసు విషయంపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. తాజాగా, ఈ కేసు విషయంలో హైకోర్టు రెండు వైపులా నుంచి వాదనలు వినింది. చివరికి కేటీఆర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది.