Hussain Sagar: హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం కలకలం రేపింది. లేక్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఓ యువతి మృతదేహం సాగర్ లో తేలియాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రామ్ గోపాల్ పేట్ పోలీసులు యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. యువతి వద్ద ఎలాంటి వివరాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
ఆత్మహత్య చేసుకుందా..
హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం కలకలం రేపింది. లేక్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఓ యువతి మృతదేహం సాగర్ లో తేలియాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రామ్ గోపాల్ పేట్ పోలీసులు యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. యువతి వద్ద ఎలాంటి వివరాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
హుస్సేన్ సాగర్ లో రామ్ గోపాల్ పేట్ పోలీసులు వెలికితీశారు. యువతి మృతదేహం తేలియాడుతుందనే సమాచారం రావడంతో.. డీఆర్ఎఫ్ బృందాల సాయంతో మృతదేహన్ని బయటకు తీశారు. మృతురాలి
వయసు.. 25నుంచి 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. యువతి మృతదేహంపై క్రీం కలర్ టాప్, ఎరుపు రంగు ప్యాంటు ధరించి ఉందని పోలీసులు తెలిపారు. ఎవరైనా సంబంధీకులు.. 040-27853595 9948031574 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
యువతి మృతదేహం లభ్యం కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.