BJP Protest: తెలంగాణ వ్యాప్తంగా భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరికొన్ని చోట్ల పోలీసులు వీరిని అడ్డుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలో జజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటించడంతో.. ఈ ఆందోళన చేపట్టారు.
పలుచోట్ల ఉద్రిక్తత.. (BJP Protest)
తెలంగాణ వ్యాప్తంగా భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరికొన్ని చోట్ల పోలీసులు వీరిని అడ్డుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలో జజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటించడంతో.. ఈ ఆందోళన చేపట్టారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో బజరంగదళ్ సంస్థను నిషేధిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పెద్ద దుమారమే రేగింది. కర్ణాటక వ్యాప్తంగా భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. బజరంగదళ్ కార్యకర్తలు నేరుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదుటే ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటనను నిరసిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా భాజపా ఆందోళనలు చేపట్టింది.
నిజామాబాద్ జిల్లాలో భాజపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడానికి ర్యాలీగా వెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నేతలకు తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రోడ్డుపైనే బీజేపీ శ్రేణులు బైఠాయించి హనుమాల్ చాలీసాను చదివారు. ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
జగిత్యాల జిల్లాలో సైతం ఇదే ఆందోళన కొనసాగించారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
హైదరాబాద్‌లో సైతం బీజేపీ.. గాంధీ భవన్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చింది. బీజేపీ పిలుపు నేపథ్యంలో గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.తమ నిరసనను బలంగా వినిపించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల పర్వం కొనసాగుతోంది.