Site icon Prime9

Tarun Chugh: కేసీఆర్ కుంభర్ణుడి నిద్రలో ఉన్నారు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్

Tarun Chugh

Hyderabad: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, దాన్ని నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుంభకర్ణుడు మాదిరి నిద్రలో ఉన్నారంటూ మండిపడ్డారు. ఈ నెల17వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తుందని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే విమోచన వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారని చెప్పారు. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా వేడుకలకు ఇప్పటికే ఆహ్వానం పంపామని చుగ్ అన్నారు.

ఖైరతాబాద్ రెడ్ హిల్స్ లక్ష్మీనగర్ లో ఉంటున్న బీజేపీ కార్యకర్త కరణ్ సింగ్ ఇంటికి వెళ్లిన తరుణ్ చుగ్, అక్కడ తేనీటి విందు స్వీకరించారు. కరణ్ సింగ్ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. తరుణ్ చుగ్ వెంట సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు రాములుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Exit mobile version