Site icon Prime9

Bandi Sanjay: బీజేపీలో బూట్లు మోసే నేతలు ఉన్నారు.. సీఎం కేసీఆర్

Telangana BJP chief seen carrying Amit Shah's shoes in viral video

Telangana BJP chief seen carrying Amit Shah's shoes in viral video

Bandi Sanjay: సీఎం కేసీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజులు చేసిన సీఎం కేసీర్ కలెక్టర్ ని కుర్చీలో కూర్చోపెట్టారు. కలెక్టరేట్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేతలు దోపిడీ దొంగలు సన్నాసులంటూ విరుచుకుపడ్డారు. 60 ఏళ్లు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో గుజరాత్ గులాములకు చెప్పులు మోస్తున్న సన్నాసులను చూస్తున్నామని ధ్వజమెత్తారు. ఆత్మగౌరవంతో బతకాలో గులాములకు సలాం కొడతారో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బూట్లు మోసే నేతలు బీజేపీలో ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. గుజరాత్ మోడల్ అంటూ దేశ ప్రజలను బీజేపీ దగా చేస్తోందని.. అడ్డగోలుగా ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మద్యపాననిషేధమున్న గుజరాత్‌లో మద్యం ఏరులైపారుతోందని.. కల్తీ మద్యం కారణంగా 70 మంది ప్రాణాలు కోల్పోయారని కేసీఆర్ అన్నారు. దీనికి ప్రధాని మోదీ ఏం సమాధానం చెబుతారని సీఎం కేసీఆర్ అన్నారు.

పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో నిర్మించిన టీఆర్ఎస్ జిల్లాశాఖ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకు ముందు హెలికాప్టర్‌ ద్వారా పెద్దపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, పుట్ట మధు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ నుంచి సీఎం కేసీఆర్‌ నేరుగా టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన పూజ కార్యాక్రమాల్లో పాల్గొని, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి జిల్లాశాఖ అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ను జిల్లా అధ్యక్షుడు సీట్లో కూర్చుండబెట్టి.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు.

Exit mobile version