Site icon Prime9

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

Basara IIT

Basara IIT

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. పీయూసీ విద్యార్థిని దీపిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్ బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న దీపకను.. హుటాహుటిన నిర్మల్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంగారెడ్డి జిల్లా కోటపల్లి మండలం గోరేకల్‌ గ్రామానికి చెందిన దీపిక బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతోంది.

 

ఆందోళనగా ఉందని(Basara IIIT)

మంగళవారం ఉదయం ఫిజిక్స్‌ పరీక్ష రాసిన దీపిక.. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరకు వచ్చి తనకు మానసికంగా ఆందోళనగా ఉందని చెప్పింది. సిబ్బంది కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో బాత్రూమ్‌కు వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటకు రాలేదు. అనుమానం వచ్చిన సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా బాత్రూమ్‌లో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. ఆమెను నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

 

Exit mobile version