Site icon Prime9

Ganesh Laddu New Record: బాలాపూర్ లడ్డు రికార్డును బ్రేక్ చేసిన బండ్లగూడ లడ్డు

bandla-guda-laddu-price

Hyderabad: గణేశ్ నవరాత్రులనగానే బాలాపూర్ లడ్డు వేలంపాట కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏటికేడు బాలాపూర్ లడ్డూ తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ రికార్డును బ్రేక్ చేస్తూ అల్వాల్ లో రూ.46 లక్షలకు వేలంపాట పాడగా, ఈ రికార్డును కూడా బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. బండ్లగూడ లడ్డూ వేలంపాట.

బండ్లగూడలో గణేష్ లడ్డూ ఏకంగా 60 లక్షలు పలికింది. రిచ్మండ్ విల్లా కాలనీలో డాక్టర్ సాజీ డిసౌజా 60 లక్షల 80 వేల రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. ఈ వేలంలో కాలనీ వాసులు పోటా పోటీగా పాల్గొన్నారు. గణనాథుడి లడ్డూ దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ సాజీ డిసౌజా బృందం తెలిపింది. కులం, మతం కాదు అందరికీ మానవత్వమే ఉండాలని చెప్పారు.

లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బులను ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సాయం చేస్తామని నిర్వహకులు తెలిపారు. నిజమైన పేదలను గుర్తించి వారికే నేరుగా హెల్ప్ చేస్తామన్నారు.

Exit mobile version
Skip to toolbar