Bandi Sanjay: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని బండి సంజయ్, ఈటల రాజేందర్ గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని బండి సంజయ్, ఈటల రాజేందర్ గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి బయల్దేరిన సంజయ్‌ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. బండి సంజయ్ ను, ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ ఘటనపై బండి సంజయ్ గన్ పార్కు అమరవీరుల స్థూపం వద్ద దీక్షకు దిగారు. తొలుత ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయిన కూడా.. బండి దీక్ష చేపట్టడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
దీక్ష ముగింపు సమయంలో.. టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్తామని సంజయ్ అనడంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. దీంతో భాజపా నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వెంటనే బండి సంజయ్, ఈటల రాజేందర్‌ను అరెస్టు చేసి వాహనంలో తరలించారు.
దీక్షకు ముందు.. బండి సంజయ్ పార్టీ కార్యాలయం నుంచి గన్ పార్క్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ చేపట్టాలని.. మంత్రి వర్గం నుంచి కేటీఆర్ ను తొలగించాలని భాజపా కార్యకర్తలు డిమాండ్ చేశారు.