Bandi Sanjay: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఈటల రాజేందర్ వెళ్లడంపై తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. పొంగులేటి ఇంటికి ఈటల వెళ్లిన విషయం తనకు తెలియదని బండి సంజయ్ అన్నారు. తనకు తెలిసిన వారితో తాను మాట్లాడుతానని.. ఈటలకు తెలిసిన వారితో ఆయన సంప్రదింపులు జరుపుతారని ఆయన అన్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఈటల రాజేందర్ వెళ్లడంపై తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. పొంగులేటి ఇంటికి ఈటల వెళ్లిన విషయం తనకు తెలియదని బండి సంజయ్ అన్నారు. తనకు తెలిసిన వారితో తాను మాట్లాడుతానని.. ఈటలకు తెలిసిన వారితో ఆయన సంప్రదింపులు జరుపుతారని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ లో నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు బండి సంజయ్ సంఘీభావం తెలిపారు. తన వద్ద ఫోన్ లేదని.. అందుకే ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఈ విషయం గురించి ఈటల సమాచారం ఇవ్వకపోవడంలో ఎలాంటి తప్పులేదని సంజయ్ అన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి భాజపాలోకి వస్తే.. ఆహ్వానిస్తామని అన్నారు. కేసీఆర్ ను గద్దె దించడానికి ఎవరితోనైనా కలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. పార్టీలో ఎవరి పనులు వారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని బండి సంజయ్ తెలిపారు.
కర్ణాటక ఎన్నికల గురించి బండి సంజయ్ ప్రస్తావించారు. భాజపా ఓటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కొరకు నిధులు పంపుతున్నారని ఆరోపించారు.కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకివస్తే బజరంగ్ దళ్ నిషేధిస్తే హిందువుల పరిస్థితి ఏంటి అని సంజయ్ ప్రశ్నించారు.