Site icon Prime9

Telangana Assembly: ఈ నెల 12, 13 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

BAC-Meeting

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం జరిగింది. సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు, చీఫ్‌విప్‌, కాంగ్రెస్‌ నుంచి భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.

ఇదిలా ఉండగా, తమను పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. స్పీకర్ మర మనిషిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Exit mobile version