Site icon Prime9

Minister Srinivas Goud: అజారుద్దీన్ నా ఆఫీసుకు వచ్చి వివరణ ఇవ్వాలి.. శ్రీనివాసగౌడ్

srinivas goud

srinivas goud

Hyderabad: జింఖానా గ్రౌండ్మ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాల పై క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) బాధ్యతా రాహిత్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ఆయన విమర్శించారు. టిక్కెట్ల విషయంలో అవకతవకలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉప్పల్‌ స్టేడియం ఉన్నది తెలంగాణలోనే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

నేటి మధ్యాహ్నం 3 గంటలకు హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ సహా అధికారులు తన కార్యాలయానికి రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. అసలు ఎన్ని టికెట్లు ఉన్నాయి. ఎన్ని ఆన్లైన్లో పెట్టారు. ఎంతమందికి కాంప్లిమెంటరీ పాసులు ఇచ్చారు అనే సమాచారంతో రావాలని మంత్రి ఆదేశించారు. మరోవైపు పోలీసులు కూడ తొక్కిసలాటకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కారణమన్నారు.

జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ తొక్కిసలాటలో మరో 20మంది గాయపడ్డారు. పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్ కు మధ్య తోపులాటలో చాలా మంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. గాయపడిన వారిని యశోద హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది.

Exit mobile version