Site icon Prime9

MGM Hospital: స్ట్రెచర్‌ లేదన్న సిబ్బంది.. భార్యను భుజాన మోసుకెళ్లిన భర్త

mgm hospital

mgm hospital

MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ ఘటన జరిగింది. ఇప్పటికే పలు వార్తల్లో నిలిచిన ఎంజీఎం ఆస్పత్రి తాజాగా.. మరో వివాదంలో చిక్కుకుంది. ఈ ఆస్పత్రిలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేసే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.

సిబ్బంది నిర్లక్ష్యం.. (MGM Hospital)

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ ఘటన జరిగింది. ఇప్పటికే పలు వార్తల్లో నిలిచిన ఎంజీఎం ఆస్పత్రి తాజాగా.. మరో వివాదంలో చిక్కుకుంది. ఈ ఆస్పత్రిలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేసే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.

వృద్ధురాలైన పేషెంట్ పట్ల.. సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన.. వృద్ధురాలికి కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో.. ఆమె భర్తే భుజాన వేసుకుని వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు.. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చింది. నెల రోజుల క్రితం.. వైద్యులు ఆపరేషన్ చేసి అరిపాదం తొలగించారు.

ఆ తర్వాత చెకప్ కోసం.. ఆమె భర్త ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ సమయానికి వైద్యులు లేరని.. రేపు రావాలని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు.

కనీసం బయటకు వెళ్లడానికి కూడా స్ట్రెచర్ ఇవ్వాలని వృద్ధురాలి భర్త కోరాడు.

దీనికి సిబ్బంది నిరాకరించడంతో.. చేసేదేమి లేక.. ఆమె భర్త భుజాలపైకి ఎక్కించుకుని బయటకు మోసుకెళ్లాడు.

అక్కడ ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియా గ్రూపుల్లో షేర్‌ చేడయంతో అది కాస్త వైరల్‌ గా మారింది.

గతంలో ఇదే ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించిన పలు సమస్యలు వెలుగులోకి వచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు.

అయినా పేషెంట్లకు అందుతున్న వైద్యం మాత్రం మెరుగుపడడం లేదన్న విమర్శలు ఇప్పటికీ వస్తున్నాయి.

స్పందించిన సూపరింటెండెంట్..

ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్పందించారు. ఎంజీఎంలో స్ట్రెచ్చర్‌ల కొరత లేదని.. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించ లేదని తెలిపారు.

కావాలనే ఎంజీఎం ఆస్పత్రిని అమవానపరిచేలా చేస్తున్నారని ఆరోపించారు.

పేషెంట్ ను భుజాలపై తీసుకుపొమ్మని ఆ పెద్దాయనకు ఎవరో చెప్పి వీడియో తీశారని తెలిపారు.

వీడియో తీసిన అతనిపై కేసు పెడతామని.. ఒకవేళ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version
Skip to toolbar