Siddipet: వివాహేతర సంబంధాలు పెట్టుకొని.. చాలా మంది తమ జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. కొందరు హత్యలకు పాల్పడితే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తాజాగా వివాహేతర సంబంధంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పెళ్లయి పిల్లలున్న మహిళతో (Siddipet)
వివాహేతర సంబంధాలు పెట్టుకొని.. చాలా మంది తమ జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. కొందరు హత్యలకు పాల్పడితే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
వివాహేతర సంబంధాలు పెట్టుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
తాజాగా, పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తన ప్రాణాలు తీసుకున్నాడు.
సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు.. పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరి మధ్య కొంతకాలం వివాహేతర సంబంధం సజావుగానే సాగింది.
కానీ ఆ మహిళ.. మరో వ్యక్తితో చనువుగా ఉంటూ ఈ యువకుడిని దూరంగా పెట్టింది.
ఆ మహిళ ఇలా దూరం పెట్టడంతో.. మనోవేదనకు గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి.. యువకుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ యువకుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళకు మరో వ్యక్తితో పరిచయం..
సిద్ధిపేట జిల్లా కునూరుపల్లి మండలం మంగోల్‌కు చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ దుకాణం షాపులో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆమెకు పిల్లలుసైతం ఉన్నారు. ఆమెతో పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం యువకుడు, మహిళ వివాహేతర సంబంధం సజావుగా సాగింది. ఉన్నట్లుండి యువకుడిని ఆమె దూరం పెడుతూ వచ్చింది. మహిళ దూరం పెట్టడం ప్రారంభించడంతో యువకుడు మానసికంగా కుంగిపోయాడు. ఎందుకిలా చేస్తుందోనని తెలుసుకొనే ప్రయత్నంలో మరో వ్యక్తితో మహిళ చనువుగా ఉంటున్న విషయాన్ని గుర్తించాడు. దీనిని తట్టుకోలేక, తన సొంత గ్రామానికి వెళ్లిన యువకుడు, పొలానికి వెళ్లి పురుగుల మందు సేవించాడు.
కొద్దిసేపటికి పొలం నుంచి వచ్చి ఇంటిముందు కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు యువకుడి వద్దకు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా.. అసలు విషయాన్ని వివరించాడు. వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.