Site icon Prime9

Vinayaka Immersions : హైదరాబాద్ లో గణనాథుల శోభయాత్రకు ఏర్పాట్లు పూర్తి..

all arrangements done for vinayaka immersions in hyderabad

all arrangements done for vinayaka immersions in hyderabad

Vinayaka Immersions : హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28వ తేదీన నగరంలోని ప్రధాన చెరువుల్లో వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందుకు గాను హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్.. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 40 వేలకు మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు 125 స్పెషల్ ప్లాటూను పోలీస్ సిబ్బంది కూడ విధుల్లో పాల్గొననున్నారు. వినాయక విగ్రహాల శోభాయాత్రలో ఖైరతాబాద్ వినాయక విగ్రహాం ప్రధానమైందిగా చెప్పవచ్చు.

ఖైరతాబాద్ మహా గణేశుడి శోభాయాత్ర నుంచి నిమజ్జనం దాకా (Vinayaka Immersions)..

బుధవారం అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ చేస్తారు

ఆ తర్వాత విగ్రహాన్ని భారీ టస్కర్ లోకి ఎక్కించే ఏర్పాట్లు

అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజాము 4 గంటల లోగా ఈ ప్రాసెస్ పూర్తి

అనంతరం వెల్డింగ్ పనులు నిర్వహణ

ఉదయం 7 గంటల నుంచి శోభాయాత్ర (టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర సాగుతుంది)

క్రేన్ నెంబర్ 4 వద్ద టస్కర్ నుంచి మహాగణపతి తొలగింపు పనులు

మధ్యాహ్నం 12 గంటలకు పూజ కార్యక్రమం నిర్వహణ

తర్వాత హుస్సేన్ సాగర్ లో మహాగణపతి నిమజ్జన కార్యక్రమం మధ్యాహ్నం 2 లోపు పూర్తి

ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్, సఫిల్ గూడ, కాప్రా, నల్లచెరువు, ఎదులాబాద్ లలోని చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రధానంగా కొనసాగుతుంది. విగ్రహాల శోభాయాత్ర సాగే మార్గంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు అంబులెన్స్ లను కూడ సిద్దంగా ఉంచారు. మరో వైపు పోలీస్ కమాండ్ సెంటర్ నుంచి అన్ని శాఖల అధికారులు నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా 3 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సుమారు 400 మంది గజ ఈతగాళ్లను కూడ సిద్దంగా ఉంచారు.

వినాయక విగ్రహాల శోభాయాత్రను పురస్కరించుకొని రేపు, ఎల్లుండి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. శోభాయాత్ర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడపనుంది. 535 బస్సులను శోభాయాత్ర కోసం ఏర్పాటు చేసినట్టుగా ఆర్టీసీ ప్రకటించింది. అదే విధంగా 2 గంటల వరకు కూడా మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. మరో వైపు హుస్సేన్ సాగర్ చుట్టూ కూడ వైద్య శిబిరాలు, పది లక్షలకు పైగా మంచినీటి ప్యాకెట్లను సిద్దం చేసింది జీహెచ్ఎంసీ.

Exit mobile version