Supreme court: బిల్లుల పెండింగ్‌పై సుప్రీంలో పిటిషన్.. విచారాణ వాయిదా

Supreme court: రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచుతూ వస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది.

Supreme court: పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి , గవర్నర్ కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

విచారణ వాయిదా.. (Supreme court)

పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి , గవర్నర్ కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచుతూ వస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. వాదనలు విన్న అనంతం రెండు వారాలకు వాయిదా వేసింది.

 

తెలంగాణ పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ బిల్లుల్లో మూడు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు.

మరో రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆమె.. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఇంకో రెండు బిల్లులను మాత్రం పెండింగ్ లోనే ఉంచారు.

కాగా, పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి , గవర్నర్ కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆమోదం కోసం 10 బిల్లులను పంపినా గవర్నర్ ఆమోదముద్ర వేయలేదంటూ గత నెలలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

‘గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లులను నిరవధింగా పెండింగ్ లో పెట్టడం రాజ్యాంగ నిబంధనల పరిధిలోకి వస్తుందా అని ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది’.

బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చింది.

అయితే విచారణ నేపథ్యంలో గవర్నర్ తమిళసై 3 బిల్లులకు ఆమోదం తెలపుతూ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

 

6 నెలలుగా పెండింగ్ ..

2022 సెప్టెంబర్ లో జరిగిన శాసనసభ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశ పెట్టింది. ఉభయ సభల ఆమోదం తర్వాత రాజ్ భవన్ కు పంపింది.

వాటిలో జీఎస్టీ సవరణ బిల్లుకు మాత్రమే గవర్నర్ ఆమోద ముద్ర వేసింది. ఇక అప్పటి నుంచి మిగిలిన 7 బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి.

అనంతరం ఈ ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్ మరో 3 బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపింది.

వీటితో కలిపి మొత్తం 10 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.

ఏయే బిల్లులు ఆమోదం పొందాయంటే

గవర్నర్ ఏయే బిల్లులను ఆమోదించారనే స్పష్టత రాలేదు. కానీ, తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు, జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు, తెలంగాణ మహిళా యూనివర్సిటీ బిల్లును ఆమోదించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపినట్టుగా తెలుస్తోంది