Site icon Prime9

Gaddar : ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగుతున్న గద్దర్ అంత్యక్రియలు.. వ్యతిరేకించిన ఏటీఎఫ్

activist and singer gaddar last riots details

activist and singer gaddar last riots details

Gaddar : ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. కాగా ప్రజల సందర్శనార్ధం 12 గంటల వరకు గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. కాగా ఇప్పుడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు కొనసాగుతున్నాయి.

ఎల్బీ స్టేడియం నుంచి తొలుత గన్ పార్క్ కు గద్దర్ పార్థవదేహాన్ని తీసుకెళ్తారు. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ లోని ఆయన ఇంటి వరకు యాత్ర కొనసాగుతుంది. గద్దర్ నివాసంలో ఆయన భౌతికకాయాన్ని కాసేపు ఉంచుతారు. అనంతరం ఆయనకు చెందిన బోధి విద్యాలయంకు తీసుకెళ్తారు. అక్కడే అంత్యక్రియలను నిర్వహిస్తారు. అంత్యక్రియలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరోవైపు గద్దర్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడాన్ని యాంటీ టెర్రరిజం ఫోరం (ఏటీఎఫ్) తప్పుపడుతోంది. గద్దర్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడం ముమ్మాటికీ పోలీసు అమరవీరులను అగౌరవపరచడమేనని ఏటీఎఫ్ కన్వీనర్ రావినూతల శశిధర్ మండిపడ్డారు. నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో ఎంతో మంది పోలీసులు, పౌరులు ప్రాణాలను కోల్పోయారని.. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ కు అంత్యక్రియలను నిర్వహిస్తే.. వారి త్యాగాలను అవమానించడమే అవుతుందని శశిధర్ అన్నారు. తన విప్లవ పాటలతో వేలాది మంది యువతను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్లించిన వ్యక్తి గద్దర్ అని ఆయన చెప్పారు. వేలాది మంది పోలీసులను నక్సలైట్ ఉద్యమం బలి తీసుకుందని.. తన సాహిత్యం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా యువత సాయుధ పోరాటం చేసేలా గద్దర్ చేశారని విమర్శించారు.

Exit mobile version