Mancherial: మంచిర్యాలలో దారుణం జరిగింది. పట్టపగలే యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే.. యువకుడి గొంతు కోసి ఆపై బండరాయితో మోదీ దారుణంగా హత్య చేశారు. ఈ హత్యను స్తానికులెవరూ అడ్డుకునే యత్నం చేయకుండా.. పైగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
https://twitter.com/Bhadra_Bhai/status/1650755078385704960?s=20
దారుణ హత్య.. (Mancherial)
మంచిర్యాలలో దారుణం జరిగింది. పట్టపగలే యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే.. యువకుడి గొంతు కోసి ఆపై బండరాయితో మోదీ దారుణంగా హత్య చేశారు. ఈ హత్యను స్తానికులెవరూ అడ్డుకునే యత్నం చేయకుండా.. పైగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ హత్యపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా జెపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన నలుగురు దారుణంగా హత్య చేశారు. నడి రోడ్డుపై యువకుడి గొంతుకోసి.. బండరాయితో కిరాతకంగా కొట్టి చంపేశారు. మహేష్ అనే యువకుడు.. బైక్ పై పెట్రోల్ పోయించుకుని.. వస్తున్న క్రమంలో అడ్డగించారు. మెుదట గొంతు కోసి.. ఆపై బండరాయితో అందరూ చూస్తుండగానే కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పెళ్లైన మహిళకు వేధింపులు..
ఈ హత్యకు వేధింపులే కారణమని పోలీసులు వెల్లడించారు. ఇందారం గ్రామానికి చెందిన అమ్మాయితో మహేశ్ ప్రేమ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది.
కానీ ఆ యువతికి వేరే అతనితో వివాహం జరిపించారు. దీంతో ఆ యువకుడు యువతిపై కక్ష పెంచుకున్నాడు.
దీంతో యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీంతో ఆరునెలల క్రితం యువతి భర్త విడాకులు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఆ యువతి తల్లి ఇంటి వద్దే ఉంటోంది. కేసు నమోదు చేసిన తర్వాత.. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
అయిన కూడా యువకుడు మారలేదు. పలుమార్లు యువతిని మహేశ్ వేధిస్తూ వచ్చాడు.
యువకుడి తీరు మారకపోవడంతో.. కత్తి, బండరాళ్లతో యువతి కుటుంబసభ్యులు దాడి చేసి హతమార్చారు.
ఘటనాస్థలాన్ని ఏసీపీ నరేందర్, ఎస్సై రామకృష్ణ పరిశీలించారు. నిందితులు పరారీలో ఉన్నారు.
ఈ దారుణ హత్య వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతమంది చూస్తున్న ఏ ఒక్కరు కూడా ఈ దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు.
యువకుడిపై పలుమార్లు వరుసగా బండరాయితో దాడి చేసిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
ఈ హత్యపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.