Mahabubabad: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇల్లంతా సందడి. బంధువులంతా వచ్చారు.. కానీ అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరుడు.. విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. పెళ్లింటా మోగాల్సిన ఆ ఇంటా.. చావు డప్పు మోగింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో జరిగింది.
పెళ్లింటా విషాదం.. (Mahabubabad)
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇల్లంతా సందడి. బంధువులంతా వచ్చారు.. కానీ అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరుడు.. విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. పెళ్లింటా మోగాల్సిన ఆ ఇంటా.. చావు డప్పు మోగింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో జరిగింది.
అప్పటి వరకు బంధువులతో ఆనందంగా గడిపిన పెళ్లికొడుకు.. ఆ కాసేపటికే మృతిచెందాడు. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్యా బాలాజీ, కాంతి దంపతులకు ఒకే ఒక్క కుమారుడు. అతడిని వివాహం నిశ్ఛయించారు. శనివారం తెల్లవారుజామున వివాహం జరగాల్సి ఉంది. కానీ అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.
బంధువులంతా వివాహ వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు. బోరు నీళ్లు పట్టేందుకు మోటార్ ఆన్ చేసే క్రమంలో ఈ ఘటన జరిగింది. దీంతో యాకూబ్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతన్ని మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు మృతి చెందడంతో కొమ్ముగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
పెళ్ళికొడుకు మృతితో కుటుంబ సభ్యులు.. బంధువులు బోరున విలపించారు. ఎదిగిన కొడుకు ఓ ఇంటివాడు అవుతున్న తరుణంలో ఇలా జరగడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కుమారుడి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, యాకుబ్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు.