Site icon Prime9

Boy Death : హైదరాబాద్ లో విషాదం.. నాలాలో పడి నాలుగేళ్ల బాలుడి మృతి.. మృతిదేహం కోసం గాలింపు చర్యలు

4 years boy death due to fell in nala at hyderbad

4 years boy death due to fell in nala at hyderbad

Boy Death : హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాల కారణంగా తాజాగా ప్రగతి నగర్‌లోని ఎన్ఆర్ఐ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నాలాలో పడి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ప్రస్తుతం బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ప్రగతి నగర్‌ ఎన్‌ఆర్‌ఐ కాలనీ సమీపంలోని ఓ నాలాలో బాలుడు పడిపోయాడు. ఈ క్రమంలో నిజాంపేట రాజీవ్‌ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహం స్థానికులకు కనిపించింది. దీంతో సమాచారం పోలీసులు నితిన్‌ను బయటకు తీసే ప్రయత్నం చేయగా.. ఆ ప్రయత్నం విఫలం కావడంలో అక్కడే ఉన్న తుర్క చెరువులోకి మృతదేహం కొట్టుకుపోయింది. కాగా ఆ చెరువు దగ్గరికి చేరుకున్న పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్‌) బృందాలు బాలుడి మృతదేహాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

జంట నగరాల్లో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇళ్లలోకి వరదు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు, మేడ్చల్‌లో అపార్ట్‌మెంట్లలో మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరుకుంది. దీంతో, వరదల్లో చిక్కుకున్న వారిని జేసీబీల సాయంతో బయటకు తీసుకువచ్చారు అధికారులు. కుత్బుల్లాపూర్ సర్కిల్ వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే వివేకానందతో కలిసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

 

Exit mobile version