Site icon Prime9

Hitech City : మాదాపూర్ హైటెక్ సిటీ లో 2 భారీ భవనాల కూల్చివేత..

2 buildings demolishes in madhapur mind space area

2 buildings demolishes in madhapur mind space area

Hitech City :  మాదాపూర్ హైటెక్ సిటీ లో 2 భారీ భవనాల కూల్చివేయడం జరిగింది. మాదాపూర్ మైండ్ స్పేస్‌లో వున్న నెంబర్ 7, 8 భవనాలను పేలుడు పదార్థాలతో క్షణాల్లో నేలమట్టం చేశారు. ఏడంతస్తుల్లో వున్న రెండు భవనాలను ఐదు క్షణాల్లో కుప్పకూల్చారు. ఎడిపిక్ ఇంజనీరింగ్ సంస్థ భవనాల కూల్చివేత చర్యలను చేపట్టింది. ఈ రెండు భవనాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కొద్దికాలం క్రితమే ఈ రెండు భవనాలను అధునాతన రీతిలో నిర్మించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల భవనాలకు సమస్యలు రావడంతో రెండింటిని ఏకకాలంలో కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ రెండు భవనాల కూల్చివేతకు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలను వాడినట్లుగా అధికారులు తెలిపారు. భవనాలను కూల్చివేసే సమయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Exit mobile version