Site icon Prime9

Kokapeta Lands : ఇదేందయ్యా ఇది.. కనీవినీ ఎరుగని రీతిలో ఎకరం 100 కోట్లు పలుకుతున్న “కోకాపేట భూములు”..

100 crores for kokapeta lands in hyderabad

100 crores for kokapeta lands in hyderabad

Kokapeta Lands : హైదరాబాద్ లో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఓవైపు చారిత్రక చార్మినార్‌ వెలుగు జిలుగులు… మరోవైపు తళుకులీతున్న ఆకాశహర్మ్యాలు. ఇంకోవైపు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు.. ఆకాశాన్నంటే ఐటీ కంపెనీలు.. విదేశాల తరహాలో స్కైవేలు, హరితహారంతో వెరసీ ప్రపంచమంతా ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తోంది. ఇలాంటి హైదరాబాద్‌ గురించి కోకాపేట ల్యాండ్స్‌ మళ్లీ మాట్లాడుకునేలా చేశాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వేలంలో హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి కోకాపేట్‌ భూములు. నియోపోలిస్‌ లేఅవుట్‌లో ఒక్క ఎకరం ధర వంద కోట్ల 75లక్షల రూపాయలు పలికి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది.

ప్లాట్‌ నెంబర్‌ 10లో 3.6 ఎకరాలకు వేలం నిర్వహిస్తే… ఒక్కో ఎకరం వంద కోట్లు దాటేసి దుమ్ముదులిపింది. మొత్తం 45.33 ఎకరాలకు వేలం నిర్వహించగా ప్రభుత్వానికి 3వేల 319కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మార్నింగ్‌ సెషన్‌లో 6, 7, 8, 9 ప్లాట్లకు ఆక్షన్‌ నిర్వహించగా హాట్‌ కేకుల్లా కొనేశాయి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు. ఎకరం ధర 68కోట్లకు తగ్గకుండా అమ్ముడుపోయింది. అసలు ఏ ప్లాట్‌లో ఏ రేట్‌ పలికాయో పరిశీలిస్తే.. ప్లాట్‌ నెంబర్‌ 6లో ఎకరం ధర రూ.73కోట్లు పలికింది. ప్లాట్‌ నెంబర్‌ 7లో ఎకరం ధర రూ.75.50కోట్లు, ప్లాట్‌ నెంబర్‌ 8లో ఎకరం భూమి రూ.68కోట్లు, ప్లాట్‌ నెంబర్‌ 9లో రూ.75.25కోట్లు పలికింది.

ఇక, సెకండ్ సెషన్‌లో 10, 11, 11 ప్లాట్స్‌లో భూములకు వేలం జరిగింది. ఈవినింగ్‌ సెషన్‌లోనే కోకాపేట భూములు సరికొత్త రికార్డులు సృష్టించాయ్‌. చరిత్రను తిరగరాస్తూ ఎకరం ధర ఏకంగా వంద కోట్లు దాటేశాయ్‌. దాంతో, దేశంలోకెల్లా అత్యంత ఖరీదైన భూమి కోకాపేటదే అని తేలిపోయింది. ప్లాట్‌ నెంబర్‌ 10లో ఎకరం భూమి రూ.100.75కోట్లు పలికింది. ప్లాట్‌ నెంబర్‌ 11లో రూ.67.25కోట్లు. ప్లాట్‌ నెంబర్‌ 14లో ఎకరం రూ.70కోట్లు పలికింది.

నియోపోలీస్‌ ఫేజ్‌-2లో ఎకరం భూమి కనీస బిడ్డింగ్‌ ధరను 35కోట్లగా నిర్ణయించింది ప్రభుత్వం. ఈ లెక్కన సుమారు 16వందల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ, ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేస్తూ పోటీపడ్డాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు. పైగా రికార్డుస్థాయిలో ఎకరం భూమి ధర వంద కోట్లు దాటేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌ చరిత్రలోనే ఇది అత్యంత అధిక ధర అంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. ఎకర భూమిని వంద కోట్ల 75లక్షల రూపాయలకు కొనుగోలుచేసి రికార్డు సృష్టించింది రాజ్‌పుష్పా ప్రొపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. మొత్తం 45.33 ఎకరాలకు వేలం నిర్వహించగా ప్రభుత్వానికి 3వేల 319కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 6, 7, 8, 9, 10, 11, 14 ప్లాట్స్‌లోని భూములు… ఒక్కొటీ ఒక్కో ధరకు అమ్ముడుపోయాయ్‌.

 

 

Exit mobile version