Site icon Prime9

Bandi Sanjay: 100 మంది ఎమ్మెల్యేలు దండుపాళ్యం ముఠాలెక్క పాగా వేసిండ్రు .. బండి సంజయ్

Bandi sanjay

Bandi sanjay

Munugodu: మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు దండుపాళ్యం ముఠాలెక్క ఇక్కడే పాగా వేసిండ్రు అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆదివారం చండూరు మండలం దోనిపాముల రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎసోళ్లు ఓటుకు రూ.40 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.ఒకనాడు తినడానికే తిండిలేని కేసీఆర్ ఇయాళ రూ.100 కోట్లతో సొంత విమానం ఎట్లా కొన్నాడని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్.వేల కోట్ల రూపాయలు సంపాదించి విదేశాల్లో పెట్టుబడులు పెట్టాడని అన్నారు.తెలంగాణలో ఉద్యోగాలివ్వని కేసీఆర్.. తన కుటుంబ సభ్యులందరికీ మాత్రం ఉద్యోగాలిచ్చుకున్నడని సెటైర్లు వేసారు.దోనిపాముల గ్రామానికి వివిధ పథకాల కింద కోట్లాది రూపాయలను కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు.పువ్వు గుర్తుకు ఓటేయకపోయినా నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ గ్రామానికి పెద్ద ఎత్తున నిధులిచ్చారని ఈ సారి రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తే ఈ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకొస్తామని అన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మళ్లీ ఫాంహౌజ్ కే పరిమితమవుతారు.తెలంగాణ పేదలంతా టీఆర్ఎస్ ని ఓడించాలని మునుగోడు ప్రజలకు చేతులెక్కి మొక్కుతున్నానని బండి సంజయ్ అన్నారు.

డబ్బు, బంగారం, మందు, మాంసాన్ని టీఆర్ఎస్ విచ్చలవిడిగా పంచుతోందని ఆయన విమర్శించారు.. మంత్రుల, అధికార పార్టీ ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు ఎందుకు తనిఖీ చేయరని బండి సంజయ ప్రశ్నించారు. రెండు, మూడు కంపెనీలు సీఎం కేసీఆర్ కు కొమ్ముకాస్తున్నాయని ఆయన ఆరోపించారు

Exit mobile version