Site icon Prime9

Ragi java: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ

Ragi java

Ragi java

Ragi java: తెలంగాణలో ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారంగా రాగిజావను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల విద్యార్దులు ఆకలితో తరగతులకు హాజరయే అవసరం ఉండదు. అంతేకాదు దీనిలో పోషక విలువలు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

బెల్లంకలిపిన రాగిజావ..(Ragi java)

ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లోని విద్యార్థుల డైట్ మెనూలో బెల్లం కలిపి తయారు చేసిన రాగి జావను చేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తన్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే రాగి, శరీరానికి అవసరమైన ప్రొటీన్లు మరియు మినరల్స్ అందించడమే కాకుండా ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.ప్రతీ ఒక్కరు తమ రోజును ప్రారంభించడానికి అల్పాహారం అత్యంత ముఖ్యమైనది.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఎక్కువమంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు. వారి తల్లిదండ్రులు ఉదయాన్నే కూలి లేదా వ్యవసాయ పనులకు బయలుదేరడంతో వారు అల్పాహారం తీసుకోవడం లేదని తెలుస్తోంది. ట్రస్టులు మరియు స్వచ్ఛంద సంస్థల సహాయంతో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే తమ విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించడం ప్రారంభించాయి.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని పాఠశాలల పనిదినాలలో మధ్యాహ్న భోజనాన్ని కొనసాగిస్తోంది. ఇపుడు తాజాగా అల్పాహారంగా రాగి జావ విద్యార్థులకు వరం కానుంది.

మధ్యాహ్న భోజనంలో మిల్లెట్స్ ..

ప్రస్తుతం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్న బియ్యం, పప్పు, సాంబార్, వెజిటబుల్ కర్రీ, పప్పుధాన్యాల కూర, వెజిటబుల్ బిర్యానీ, బగరా రైస్, పులిహోర వంటి ప్రత్యేక అన్నం అందిస్తున్నారు. విద్యార్థులకు తగినన్ని ప్రొటీన్లు, పోషకాలు అందేలా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం వారానికి మూడుసార్లు గుడ్డు అందిస్తోంది.మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో మిల్లెట్స్ ను చేర్చే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. హైస్కూల్ విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు సార్లు మిల్టెట్స్ అందించే అవకాశం ఉంది.

Exit mobile version
Skip to toolbar