Site icon Prime9

Telangana: రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది కానుకగా సన్నబియ్యం

Telangana Government Key Announceme For Ration Consumers: రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని హుజూర్ నగర్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

 

ఇందులో భాగంగానే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,82కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. కాగా, ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం అందిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల మాట్లాడారు. ఉగాది పండుగ రోజు నుంచి రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం రాష్ట్ర జనాభాలో 84 శాతం మందికి సన్న బియ్యం అందించనున్నట్లు వివరించారు. ఈ బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 

ఇక, ప్రస్తుతం అందిస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందించడంతో రాష్ట్రంపై అదనంగా రూ.1500కోట్ల భారం పడనుంది. దాదాపు సన్న బియ్యం నెలకు 2 లక్షల టన్నులు అవసరం కానుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డు కోసం సుమారు 20లక్షలమంది దరఖాస్తు చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar