Telangana BJP MLC Candidate Announced: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్. గౌతమ్ రావును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. కాగా, ఎన.గౌతమ్ రావు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే మే 1తో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం ముగియనుంది. కాగా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, సోషియాలజీలో డాక్టరేట్ పొందిన గౌతమ్ రావు.. వీబీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్‌గా ఉన్నారు.
Telangana BJP: హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు.. ఎవరంటే?
