Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందింది. గంటా రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చాలా కాలం క్రితమే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల ముందు గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలపడం హాట్ టాపిక్‌గా మారింది.
2021, ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా సమర్పించారు.అయితే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేదంటూ ఆరోపణలు రావడంతో మరలా ఫిభ్రవరి 12న ఆ ఫార్మాట్ లో రాజీనామా సమర్పించారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ స్పీకర్ ను కోరారు. దీనితో తాజాగా స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో టీడీపీ అలర్ట్ అయ్యింది. వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్ధం చేస్తోంది. తామిచ్చిన డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్ల ఆమోదానికి స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వంశీ, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌పై డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్ వేసింది. పార్టీ మారిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డిపైనా వేటు పడుతుందని టీడీపీ అంచనా వేస్తోంది.