Manifesto Released: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, సిద్ధార్థ్‌నాథ్‌సింగ్ కలిసి మేనిఫెస్టో విడుదల చేశారు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని.. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 15వందల అందిస్తామని చెప్పారు. 18 నుంచి 59 వయస్సు మహిళలకు ఆడబిడ్డ నిధి వర్తిస్తుందన్నారు. తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి 15వేలు అందిస్తామన్నారు. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ వర్తిస్తుందని చెప్పారు. దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. నిరుద్యోగులకు నెలకు 3 వేలు భృతి చెల్లిస్తామన్నారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని.. రైతులకు ఏడాదికి 20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.
మేనిఫెస్టోలో మఖ్యాంశాలు..(Manifesto Released)
బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పెన్షన్
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యయం
స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ను పునరుద్ధరణ… నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు
బీసీలకు స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు… ఆదరణ కింద రూ.5 వేల కోట్ల ఆధునిక పనిముట్ల అందజేత
యాదవులు అధికంగా ఆధారపడే పాడి పరిశ్రమకు బీమా సౌకర్యం… అధిక రుణాలతో ఆధునికీకరణలో భాగస్వామ్యం
గొర్రెల పెంపకంపై ఆధారపడిన కురుబ వర్గం సాధికారతకు చర్యలు
చేనేత పరిశ్రమలో ఇబ్బందుల్లో ఉన్నవారికి పవర్ లూమ్ వారికి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ వారికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం… ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల సాయం
దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం… వారి షాపులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం
గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్
వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్… రాయల్టీ, సీనరేజి చార్జీల్లో మినహాయింపు
రజకులకు ఉపయోగపడేలా దోబీ ఘాట్ ల నిర్మాణం… 200 యూనిట్ల విద్యుత్ ఉచితం
ప్రతి ఇంటికీ ఉచితంగా కుళాయి కనెక్షన్
సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం. జీవో.217 రద్దు చేస్తామని తెలిపారు.