Site icon Prime9

CM Jagan: టీడీపీ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదు.. సీఎం జగన్

CM Jagan

CM Jagan

CM Jagan: చంద్రబాబుకు పదవి కావాల్సింది ప్రజలకు మంచి చేయడానికి కాదని.. రాష్ట్రాన్ని దోచుకునేందుకు, పంచుకునేందుకే వారికి అధికారం కావాలని సీఎం జగన్ అన్నారు. పుట్టపర్తిలో రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు  విడుదల చేసిన జగన్ టీడీపీపై విమర్శలు గుప్పించారు.

స్కాంల గురించే ఆలోచన..(CM Jagan)

చంద్రబాబు హయాంలో స్కీంల గురించి కాదు.. స్కాంల గురించే ఆలోచన అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే ప్రజలకు ఒకటి కూడా మంచి పథకం గుర్తుకు రాదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు పదవి కావాల్సింది ప్రజలకు మంచి చేయడానికి కాదు..వారికి రాష్ట్రాన్ని దోచుకునేందుకు, పంచుకునేందుకే అధికారం అని అన్నారు. చంద్రబాబు హయాంలో స్కాంల గురించే ఆలోచన జరిగింది.స్కిల్ స్కాం, ఇసుక స్కాం, రాజధాని భూముల స్కాం, మద్యం స్కాం ఇలా చంద్రబాబు పేరు చెబితే స్కాంలు మాత్రమే గుర్తుకు వస్తాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదు.14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు రైతులకు చేసింది శూన్యం.ఈ నాలుగేళ్లలో ఎక్కడా కరువు లేదు. చంద్రబాబు హయాంలో అంతా కరువే.ప్రతీ గ్రామంలో ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి.పంట నష్టం జరిగితే ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తున్నామని జగన్ పేర్కొన్నారు.

సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చారు..

గతంలో సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చారని సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ.. రైతుకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం ఇది.చుక్కల భూములు, ఇనామ్ భూముల సమస్యలు పరిష్కరించామని తెలిపారు.గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను ఆలోచించాలన్నారు. ఈ నాలుగేళ్లలో ఎక్కడా కరువు లేదు. ప్రతీ విషయంలో రైతులకు అండగా నిలబడ్డాం. ప్రతీ గ్రామంలో ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి.పంట నష్టం జరిగితే ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. ప్రతీ గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్కులు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. మీ బిడ్డ నమ్ముకుంది మిమ్నల్నే. మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి అంటూ జగన్ అన్నారు. 53 లక్షల 53 వేల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.2200 కోట్లు అందజేస్తున్నామన్నారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్రప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోందన్నారు.

 

Exit mobile version