Site icon Prime9

MLA Pinnelli: ఎమ్మెల్యే పిన్నెల్లి కి సుప్రీమ్ కోర్టులో షాక్

MLA Pinnelli

MLA Pinnelli

 MLA Pinnelli: వైసీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. కౌంటింగ్ రోజు పిన్నెల్లిని కౌంటింగ్ సెంటర్ వద్దకు వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయట ఉంటే తనకు ప్రాణహాని ఉందని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.పిన్నెల్లి కి హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు పై శేషగిరి రావు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

శేషగిరి రావు పిటిషన్..( MLA Pinnelli)

ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్టు చేయాలని, అరెస్టుకు హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఎత్తివేయాలని శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈనెల 6 వరకు అరెస్టు చేయవద్దన్న వెసులుబాటు ఎత్తివేయాలని పిటిషన్‌ దాఖలు చేయగా, ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని సుప్రీం ఆదేశించింది హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చినా , కౌంటింగ్ సెంటర్ కు వెళ్లకుండా సుప్రీమ్ కోర్ట్ బ్రేక్ వేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది . ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి వార్తల్లోకి ఎక్కారు . పిన్నెల్లి సోదరులు ఎన్నికల సందర్భంగా ,ఎన్నికల అనంతరం హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని తెలుగుదేశం ఆరోపణలు చేసింది . ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కౌంటింగ్ సెంటర్ కు వెళ్లకుండా చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం . ఈ నెల 6వ తేదీన దీని పై సమగ్ర విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

 

Exit mobile version