Site icon Prime9

Amaravati : అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఏపీ సర్కార్ కు ఒకటి ప్లస్.. మరొకటి మైనస్

Amaravati

Amaravati

Amaravati: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు తీర్పులో కొన్ని అంశాలపై ప్రభుత్వానికి తక్షణ ఉపశమనం లభించినట్లైంది. కాలపరిమితిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది.అయితే అసలు మూడు రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఇచ్చిన హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.

ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం ముందు విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు అయ్యేలా చూడాలని రైతులు కోరారు. కాగా.. హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది
రైతుల తరపున సీనియర్ లాయర్ సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. 29 వేల మందిరైతులు తమ బతుకు దెరువు అయిన భూమిని రాజధానికి ఇచ్చారన్నారు. ఇలా ఇవ్వడం వల్ల రాష్ట్రానికే.. కాదని.. వారికి కూడా లాభం ఉంటుందన్నారు. కానీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఉల్లంగిస్తున్నారని.. 2019 నుంచి ఎలాంటి నిర్మాణాలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ధర్మాసనానికి చూపించారు.

అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి ఎంత వెచ్చించారని జస్టిస్ జోసెఫ్ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. రూ. 150 కోట్లు కేటాయించారని.. ఇప్పటి వరకూ 116 కోట్లు ఖర్చు చేశారన్నారు. అయితే అది టెంపరరీ హైకోర్టు అని వాదించారు. వాదనలు జరుగుతున్న సమయంలో బెంచ్‌లో ఉన్న జస్టిస్ నాగరత్న ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని.. హైకోర్టు ఎలా చెబుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు సిటీ ప్లానర్‌గా మారుతుందా అని ప్రశ్నించారు. అ తదుపరి విచారణలో రైతుల వాదన పూర్తి స్థాయిలో వింటామని ధర్మానసం తెలిపింది. నిర్మాణాలపై కాలపరిమితి విధిస్తూ ఇచ్చిన అంశాలపై స్టే ఇచ్చింది.

Exit mobile version