MLA Tatikonda Rajaiah: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కకపోవడంతో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీరు పెట్టారు. అనుచరుల ముందు బోరున విలపించారు. వరంగల్ అంబేద్కర్ విగ్రహం ముందు పడుకుని ఏడ్చారు. వర్షంలో తడుస్తూ కాసేపు మౌనదీక్ష చేపట్టారు.రాజయ్యను చూసి కార్యకర్తలు కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్ గీసిన గీత దాటనని రాజయ్య తెలిపారు.
ఏనాడూ కేసీఆర్‌ను తను ఒక్క మాట అనలేదన్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి రమ్మంటే వచ్చానని తెలిపారు. ఆయన చెప్పిన మాట విన్నాను. స్థాయికి తగ్గట్లు అవకాశం ఇస్తానని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పార్టీ శ్రేణులకు రాజయ్య పిలుపునిచ్చారు. పశువుల కాపరిగా ఉన్న తాను పిల్లల డాక్టర్ నయినా, తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఉపముఖ్యమంత్రి నయినా ఇదంతా అంబేద్కర్ వలనే అని రాజయ్య చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బీఆర్ఎస్ విజయానికి కృషి చేద్దామని అన్నారు. ఈ సందర్బంగా రాజయ్యను చూసిన పలువురు కార్యకర్తలు కూడా ఎమోషన్ అయి కంటతడి పెట్టారు.