Sonia Gandhi Temple: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ నేత గుడి కట్టించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ నేవూరి మమత-వెంకట్‌రెడ్డి దంపతులు సోనియాగాంధీకి పాలరాతితో గుడి కట్టించారు. ఇందులో సోనియాగాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసారు. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా స్దానిక కాంగ్రెస్ నేతలతో కలిసి దీనిని ప్రారంభించారు.
నాకు దైవం లాంటివారు..(Sonia Gandhi Temple)
ఈ సందర్బంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ సోనియావల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆమె తనకు దైవం లాంటివారని అన్నారు. అందుకే ఆమెకు పాలరాతితో గుడి కట్టించానని చెప్పారు. గతంలో తెలంగాలోనే బీఆర్ఎస్ పార్టీ నేత ఒకరు కేసీఆర్ కు గుడి కట్టించిన విషయం తెలిసిందే. ఇక తమిళనాడులో అయితే సినిమానటి కుష్బూకు ఆమె అభిమానులు గుడికట్టారు. అక్కడ దివంగత సీఎంలు కరుణానిధి, జయలలిత కోసం ఆత్పార్పణం చేసుకున్న కార్యకర్తలు కూడా ఉన్నారు.