Somesh Kumar: తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయినా సోమేశ్ కుమార్.. ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. అనంతరం సీఎం జగన్ తో భేటి అయ్యారు. భేటీ అనంతరం ఏపీ సీఎస్ ని కలవగా.. ఏపీ ప్రభుత్వంలో జాయినింగ్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేశారు.
ఏపీ క్యాడర్ కు చెందిన సోమేశ్ కుమార్ సేవలను తెలంగాణలో కొనసాగింపును ఇటీవల హైకోర్టు కొట్టేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ ను ఏపీకి కేంద్రం కేటాయించింది. దీంతో క్యాట్ కి వెళ్లిన ఆయన.. తెలంగాణలో విధులు నిర్వహించుకునేలా అనుమతి ఇచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో సోమేశ్‌కుమార్ ఏపీలో రిపోర్ట్ చేయాలని సూచించింది.
కోర్టు తీర్పు అనంతరం డీవోపీటీ ఆదేశాలు జారీచేసింది. దీంతో సోమేశ్‌కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. సీఎం జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించిన అందులో కొనసాగుతానని సోమేశ్ కుమార్ తెలిపారు. అనంతరం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని నియమాకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకున్నారు.
విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం ఆదేశాల మేరకు ఏపీకి వచ్చినట్లు తెలిపారు. ఇక్కడి ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానని తెలిపారు. ఒక ఐఏఎస్ గా డీవోపీటీ ఆదేశాలు పాటించానని వివరించారు. స్వచ్ఛంద పదవి విరణమపై ప్రశ్నించగా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే కుటుంబ సభ్యులను అడిగి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/