Sabitha Indra Reddy Protest: బోనాల పండుగ చెక్కుల పంపిణీ సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ ను ఉల్లంఘించారంటూ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. మహేశ్వరంలోని ఆర్కేపురం డిజవిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలకు ఆలయ కమిటీలకు చెక్కుల పంపిణీ సందర్బంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
వేదికపైకి కేఎల్ఆర్ ..(Sabitha Indra Reddy Protest)
చెక్కులు స్వీకరించే వారిని మాత్రమే సమావేశ మందిరంలోకి అనుమతించామని, ఎమ్మెల్యే వెంట వచ్చే అనుచరులను అనుమతించేది లేదని పోలీసులు, ఈఓ స్పష్టం చేశారు. చెక్కుల పంపిణీ సందర్భంగా కాంగ్రెస్ మహేశ్వరం ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని వేదికపైకి ఆహ్వానించడంపై సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరం తెలిపారు. ప్రోటోకాల్ లేని వ్యక్తులను వేదికపైకి ఎలా ఆహ్వానిస్తారంటూ ప్రశ్నించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతు దారుల మధ్య తోపులాట జరిగింది. ఒకవైపు బీఆర్ఎస్ ఆందోళన కొనసాగుతుండగానే ఆలయ కమిటీలకు అధికారులు బోనాల ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి చెక్కులను పంపిణీ చేసారు.
ఇదేనా ప్రజాపాలన..
ఇలా ఉండగా దీనిపై బీఆర్‌ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమం x లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి , 5 సార్లు సీనియర్ ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డి తన హక్కులకోసం నిరసనకు దిగవలసి వచ్చింది.ఓడిపోయిన అభ్యర్థులు స్టేజ్ పైన ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యే స్టేజ్ కింద !!అఫీషియల్ ప్రోగ్రాంలో ఓడిపోయిన అభ్యర్థులకు పని ఏంటి ?
ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ?ఇదేనా ప్రజా పాలన ? అంటూ కేటీఆర్ ట్వీట్ చేసారు.