Site icon Prime9

Rtc Twitter Hacked: తెలంగాణ ఆర్టీసీ ఎండీ ట్విటర్ అకౌంట్‌ హ్యాక్‌

rtc twitter

Rtc Twitter Hacked: వరుస ట్విట్టర్ల హ్యాక్ లు కలకలం సృష్టిస్తున్నాయి. ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి  ప్రపంచవ్యాప్తంగా రోజు చోటు చేసుకుంటున్నాయి.

సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నాక.. ఆర్టీసీ ఎండీ ట్విట్టర్ హ్యాండిల్ ను చాలా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఓ వైపు ఆర్టీసీ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు చూపు ఆర్టీసీపై పడింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ ఆఫీస్‌ ట్విట్టర్ ను హ్యాక్‌ చేశారు. అకౌంట్లను హ్యాక్ చేసిన నేరగాళ్లు.. ట్విట్టర్ హ్యాండిల్‌ను మార్చారు. ఆర్టీసీ ఎండీ స్థానంలో ఫ్రాంక్లిన్‌ అని పేరు మార్చి డీపీలో కోతి ఎమోజీని ఉంచారు. హ్యాక్ చేసిన అనంతరం వరుస పోస్టులు కూడా చేశారు.

హ్యాక్ అయిన సంగతి గుర్తించిన ఆర్టీసీ టెక్నికల్ టీమ్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ ఈ అకౌంట్ ను ఉపయోగిస్తున్నారు.

twitter hacked

దేశంలో వరుసగా ప్రముఖ సంస్థలు.. రాజకీయ పార్టీల నాయకుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్‌ అవుతున్నాయి.

ఇటివలే వైసీపీ అకౌంట్ ను కూడా హ్యాక్ చేశారు. ఇలాంటి ఘటనలే మరికొన్ని చోటు చేసుకున్నాయి.

ఐపీఎల్‌ జట్టు ఆర్సీబీతో పాటు.. సెలబ్రిటీల ఖాతాలను హ్యాకర్లు హ్యాక్ చేశారు.

ఆర్టీసీ (TSRTC )ఎండీగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్.. ఈ ట్విట్టర్ వేదికగానే ప్రజల సమస్యలను వినేవారు.

మరోవైపు ప్రజా రవాణా సంక్షేమం గురించి వివరిస్తున్నారు.

రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై కూడా ఈ ట్విట్టర్ అకౌంట్ ద్వారా సజ్జనార్ అవగాహన కల్పించేవారు.

ఇటీవల అధిక డబ్బుకు మల్టి లెవల్ మార్కెటింగ్ వలలో చిక్కుకోవద్దని.. ఈ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అలా జరిగిన కొద్ది రోజుల్లోనే ఈ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ గురైంది.

ట్విట్టర్ అకౌంట్ ను తిరిగి పునురుద్దరించేందుకు.. టెక్నికల్ టీం రంగంలోకి దిగింది.

దీనిపై పోలీసులు విచారణ సైతం ప్రారంభించారు.

సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఆర్టీసీ ఎండీ అకౌంట్.

అలా చేసిన కొద్ది రోజుల్లోనే హ్యాక్ కు గురైంది.

ప్రస్తుతం అకౌంట్ ను వినియోగిస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version