Site icon Prime9

TSRTC: టూరిస్ట్ స్పాట్స్ గా సింగరేణి గనులు.. తెలంగాణలో కోల్ టూరిజంకు ఆర్టీసీ ప్యాకేజీ

TS RTC

TS RTC

TSRTC: తెలంగాణలో ప్రసిద్ది చెందిన సింగరేణి గనులను టూరిస్ట్ స్పాట్స్ గా తీర్చిదిద్దేందుకు టిఎస్ ఆర్టిసీ ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక చరిత్ర కలిగిన బొగ్గు గనులు, కార్మికుల పనితీరు, జీవన విధానం, బొగ్గు సరఫరా జరిగే విధానం ఇలా మొత్తంగా సింగరేణి ప్రాంతం గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు తెలంగాణ ఆర్టిసి ”సింగరేణి దర్శిని” పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. సింగరేణి యాజమాన్యం సహకారంతో భూగర్భ, ఓపెన్ కాస్ట్ బొగ్గుగనులను కూడా సందర్శించేలా కోల్ టూరిజం పేరిట డెవలప్ మెంట్ కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుండి సింగరేణి ప్రాంతాలను చుట్టివచ్చేలా ప్రత్యేక బస్సు సర్వీసులను తెలంగాణ ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

7 జనవరి 2023 నుంచి ప్రతి శనివారం టూరిజం బస్సును నడుపనున్నారు. ప్యాకేజీలో భాగంగా 350 కిలో మీటర్ల పరిధిలోని సింగరేణి బొగ్గు గనులు, అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్స్‌, ఓపెన్‌ కాస్ట్‌ గనులు, జైపూర్‌ విద్యుత్‌పవర్‌ ప్లాంట్‌ ను తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్‌ నుంచి రూ 1850, కరీంగనర్‌ నుంచి 1050గా టికెట్‌ ధర నిర్ణయించారు. అయితే డిసెంబర్‌ 31లోగా బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులకు రూ 250 రాయితీతో జూబ్లీ నుంచి రూ 1600, కరీంనగర్‌ నుంచి 800 అందించనున్నారు. సింగరేణి దర్శన్‌కు వెళ్లే పర్యాటకులు ఆర్టీసీ వెబ్‌సైట్‌ www. tsrtconline.inలో టికెట్లు బుకింగ్‌ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Exit mobile version