Site icon Prime9

Hero Venkatesh: హీరో వెంకటేష్, కుటుంబ సభ్యులపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం

Hero Venkatesh

Hero Venkatesh

Hero Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వెంకటేష్‌తో పాటు హీరోలు రానా, అభిరామ్, సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు సహా అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. నందకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు విచారించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేశారని నందకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్లాది రూపాయల విలువైన భవనాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని తెలిపారు.

అక్రమంగా కూల్చారు..(Hero Venkatesh)

కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హోటల్‌ను కూల్చివేసేందుకు వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ పోలీసులతో కుమ్మక్కయ్యారని తెలిపారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను నియమించి హోటల్‌ను ధ్వంసం చేయడంతో రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

Exit mobile version