NIA Raids: ఎన్‌ఐఏ అదుపులో రాయదుర్గం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

ఇస్లామిక్ తీవ్రవాదానికి ఏపీ లోని ముస్లిం యువత కూడా లోనవుతుంది .గతంలో కూడా చాలా సంఘటనలు రుజువు చేసాయి . అరెస్టులు కూడా జరిగాయి . తాజాగా ఇలాంటి డే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది .

  • Written By:
  • Publish Date - May 21, 2024 / 01:29 PM IST

NIA Raids: ఇస్లామిక్ తీవ్రవాదానికి ఏపీ లోని ముస్లిం యువత కూడా లోనవుతుంది .గతంలో కూడా చాలా సంఘటనలు రుజువు చేసాయి . అరెస్టులు కూడా జరిగాయి . తాజాగా ఇలాంటి డే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది .పట్టణంలోని ఆత్మకూర్‌ వీధికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌ కుమారుడు సోహెల్‌ను పోలీస్ లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు . అబ్దుల్‌ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్‌ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల సోహెల్‌ ఎస్‌బీఐ ఖాతాకు అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతడి కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం సోహెల్‌ను రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉగ్రవాదులతో సంబంధాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా బయటకి రాలేదు .

ముస్లిం యువతను ప్రభావితం చేస్తున్న ఐసిస్..(NIA Raids)

ఇటీవల భారతదేశ ముస్లిం యువత ఇస్లామిక్ తీవ్రవాదంతో ప్రభావం చెందుతుంది .ఒకప్పుడు కాశ్మీర్ కే పరిమితమైన ఈ పరిస్థితి ఇప్పుడు దేశమంతా వ్యాప్తి చెందుతుంది .అమాయకపు ముస్లిం యువత తో పాటు ,బాగా చదువుకున్న యువకులను కూడా ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు లోబర్చుకుంటున్నాయి .దింతో మంచిగా వున్న కుటుంబాలు కూడా ఛిద్రమవుతున్నాయి .మునుపటి కన్నాఇప్పుడు ఎన్ ఐ ఏ చాలా పగడ్బందీగా వ్యవహరిస్తూ ఇలాంటి వాటిని తిప్పికొడుతోంది.