Site icon Prime9

Rat in Chutney: కాలేజి హాస్టల్ చట్నీలో ఎలుక..

Rat in chutney

Rat in chutney

Rat in Chutney:సంగారెడ్డి జిల్లా సుల్తాన్‎పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ హాస్టల్ చట్నీలో ఎలుక ప్రత్యేక్షమైంది. నాణ్యతలేని భోజనం.. సాంబార్‎లో ఈత కొడుతున్న ఎలుకలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల క్రితమే ఫుడ్ క్రాంట్రాక్టర్ మార్చాలని విద్యార్థుల ఆందోళన చేశారు. కాంట్రాక్టర్‎ను మారుస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. కానీ జేఎన్టీయూ తీరు మారడంలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

మంత్రి రాజనరసింహ పట్టించుకోలేదు..(Rat in Chutney)

హాస్టల్ సిబ్బంది మంగళవారం అల్పాహారం కోసం వేరుశెనగ చట్నీతో పాటు ఇడ్లీని సిద్ధం చేశారు. చట్నీలో ఎలుక సంచరించడం గమనించిన విద్యార్థులు వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియోలు కాసేపట్లో వైరల్‌గా మారాయి.హాస్టల్ యాజమాన్యం విద్యార్థులను శాంతింపజేసేందుకు యత్నిస్తుండగా విద్యార్థులు, బీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు నిరసనకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జేఎన్‌టీయూ-సుల్తాన్‌పూర్‌ విద్యార్థుల సమస్యలపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అందోల్‌ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ ఆరోపించారు.గత కొద్ది రోజులుగా విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని క్రాంతి కిరణ్ తెలిపారు.అయితే విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు మంత్రి ఈ హాస్టళ్లను ఏనాడూ సందర్శించలేదని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు జేఎన్‌టీయూ-సుల్తాన్‌పూర్‌లో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు.

Exit mobile version