Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మళ్లీ వార్తల్లో నిలిచారు.
ఎప్పుడు ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలిచే వర్మ.. ఈసారి కొత్తగా మరోపని చేశారు.
ఎప్పుడు పబ్ లలో, ఫంక్షన్ లలో కనిపించే వర్మ.. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా కాకినాడలో సందడి చేశారు.
వలసపాకలో జరుగుతున్న కోడి పందాలను ఆయన తిలకించారు.
పందెంలో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
రామ్‌గోపాల్ వర్మతో పాటు నటుడు కృష్ణుడు కూడా ఈ పందాలను వీక్షించారు.
ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసానికి రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)..
ఇక ఆర్జీవీ రాకతో కాకినాడలో సందడి వాతావరణం నెలకొంది.
స్థానికులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
అంతకు ముందు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాసానికి చేరుకున్న ఆర్జీవీ.. అక్కడ అల్పహారం స్వీకరించారు.
అలానే ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
అనంతరం కోడి పందాలను చూసేందుకు ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడతూ.. నటుడు నాగబాబు వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించారు వర్మ.
నాగబాబు గురించి రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏమన్నారంటే..
నాగబాబు ఏం మాట్లాడారో వినలేదు అన్నారు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).
ఫ్రీ గా ఉన్నప్పుడు నాగబాబు కామెంట్స్ చూసి స్పందిస్తాను అని తెలిపారు.
ఫ్రెండ్స్ పిలిస్తే ఇక్కడి వచ్చానని.. ఎటువంటి రాజకీయాలకు ఇక్కడ ఛాన్స్ లేదని వెల్లడించారు.
కాగా కోడి పందాలను చూడబోతున్నట్లు ముందుగానే ట్విట్టర్ లో వెల్లడించారు ఆర్జీవి.
నా జీవితంలో మొట్ట మొదటి సారి ఆంధ్రాలో పబ్లిక్ గా ప్రజలతో సంక్రాంతి సంబరాలలో పాల్గొనబోతున్నాను.
దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని నన్ను ద్వేషించే పార్టీ మీద ఒట్టేసి చెప్తున్నాను అంటూ పండుగకు ముందే ఆయన ట్వీట్ చేశారు.
అసలు నాగబాబు ఏమన్నారంటే..
ఇక ఇటీవలే రాంగోపాల్ వర్మపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాంగోపాల్ వర్మ అనే వాడు పెద్ద ఎదవ అని.. నీచ్, కమీనే, కుత్తేగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాడు అవసరం కోసం ఎంతకైనా దిగజారుతాడని వర్మపై ఫైర్ అయ్యాడు నాగబాబు.
పవన్ కళ్యాణ్ గురించి, కాపు సామాజిక వర్గం గురించి ట్విట్టర్ వేదికగా రాంగోపాల్ వర్మ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అందుకు బదులుగానే నాగబాబు ఈ విధంగా ఆర్జీవి పై మండిపడ్డారు.
తాను కులాన్ని గౌరవిస్తానని, కానీ తనకు కుల పిచ్చి లేదని అన్నారు నాగబాబు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/