Site icon Prime9

Rains : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడు రోజుల పాటు దంచికొట్టనున్న వర్షాలు.. హైదరాబాద్ లో రికార్డు

rains alert in ap and telangana for upcoming 2,3 days

rains alert in ap and telangana for upcoming 2,3 days

Rains : ఒక వైపు మండిపోయే ఎండాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు ఊహించని రీతిలో వర్షాలు కూరుస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురు వారాల్లో చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌తో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన భారీ వర్షం కురవడం మనం గమనించవచ్చు.

హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం (Rains)..

హైదరాబాద్ లో మంగళవారం నాడు రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రెండు గంటల్లోనే ఏకంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వేసవి మధ్యలో ఇలా కుండపోత వాన కురవడం ఇదే తొలిసారని వాతావరణశాఖ పేర్కొంది. 12 ఏప్రిల్ 2015లో అత్యధికంగా 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంతకుమించిన వర్షపాతం నమోదైంది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

(Rains) ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం నాడు రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షాలు పడ్డాయి. అయితే మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అనంతపురం, నంద్యాల, కర్నూల్, ప్రకాశం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లోనూ ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు.

ఉరుములు, మెరుపులతో పాటు వర్షం పడుతున్న సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండొద్దని అధికారులు సూచించారు. ఎక్కువగా బయట ప్రదేశంలో ఉండే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు, తదితరులు వర్షాలు కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.

 

ఈ వర్షాలకు పలు చోట్ల విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ లోని రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని ఎస్పీఆర్‌హిల్స్ ఓం నగర్ కూడలిలో గోడకూలి 8 నెలల చిన్నారి జీవనిక మృతి చెందింది.

Exit mobile version