Prime9

Rape Attempt On Thai Student At HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం..

Hyderabad Central University: సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్దులను బిడ్టల్లా చూసుకోవలసిన అధ్యాపకుడే కీచకుడిగా మారాడు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అత్యాచారం చేసేందుకు యత్నించాడని విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. థాయ్‌లాండ్‌ చెందిన బాధిత విద్యార్థిని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. విద్యార్థినిపై ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే అతడి బారి నుంచి తప్పించుకున్న విద్యార్థిని.. ఈ విషయంపై గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. ప్రొఫెసర్ రవిరంజన్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థిని ఫిర్యాదుపై విచారణ చేపట్టారు.

సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచార యత్నం చేశాడని తెలుసుకున్న విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బటపట్టాయి. యూనివర్శిటీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించింది. దీంతో యూనివర్శిటీ గేట్ ముందు ఉద్రిక్తత నెలకొంది.ప్రొఫెసర్ రవిరంజన్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. 354 ఐపీసీ కింద కేసు నమోదు చేశాము. బుక్ కోసం క్యాంపస్ బయటికి పిలిచి అత్యాచారం చేయబోయాడు. ప్రొఫెసర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం.బాధితురాలి స్టేట్మెంట్ బట్టి సెక్షన్స్ యాడ్ చేస్తామని మాదాపూర్ డిసిపి శిల్పవల్లి తెలిపారు.

Exit mobile version
Skip to toolbar