Sriharikota: ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ప్రయోగించాలనుకున్న ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ -షార్ లోని ప్రైవేట్ లాంచింగ్ వేదిక నుంచి మంగళవారం ఉదయం ఈ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది.
సాంకేతిక సమస్యతో..( Sriharikota)
అయితే ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వాయిదావేశారు. గతంలో కూడా ఈ శాటిలైట్ ప్రయోగం వాయిదాలు పడుతూ వస్తోంది . దీంతో నాలుగో సారీ రాకెట్ ప్రయోగం వాయిదాపడినట్లయింది. చెన్నైకి చెందిన ప్రైవేటు స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాణ్ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్ -సార్టెడ్ రాకెట్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించింది. సొంత లాంచ్‌ప్యాడ్ ఏర్పాటుచేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలనుకున్నది. షెడ్యూల్ ప్రకారం 8 గంటల కౌంట్‌డౌన్ అనంతరం మంగళవారం ఉదయం 5.48 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషయంలో ప్రయోగాన్ని నిలిపివేశారు.