Site icon Prime9

Prajavani: ముగిసిన ఎన్నికల కోడ్.. నేటి నుంచి ప్రజావాణి తిరిగి ప్రారంభం

Prajavani

Prajavani

 Prajavani: నేటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభమైంది. లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ముగియడంతో ప్రజావాణి తిరిగి ప్రారంభించారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం నేటి నుంచి పునః ప్రారంభం కానున్నట్లు ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో కొనసాగనుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు.

ప్రజావాణి వినతులకు ప్రాధాన్యం..( Prajavani)

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈరోజు ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి పరిష్కరించాలని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వర పరిష్కారాలు చూపాలని కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజావాణి రీస్టార్ట్ | Prajavani Programme Restart Again | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar