Site icon Prime9

KTR: విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ముఖ్యం.. మంత్రి కేటీఆర్

KTR

KTR

KTR: విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ముఖ్యమని, సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో శనివారం జరిగిన ఐదో స్నాతోకత్సవానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫాంలను అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీహబ్‌తో బాసర ట్రిపుల్‌ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని అన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ కీలక పాత్రపోషిస్తున్నాయని చెప్పారు.

మిషన్ భగీరథ ద్వారా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు నీరు అందిస్తాం. క్యాంపస్ విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నందున మొత్తం సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. రూ.5 కోట్లతో సైన్స్ క్లబ్ ఏర్పాటు చేస్తాం. క్యాంపస్ లోని చెరువును సుందరీకరణ చేస్తాం. వెంటపడి పనులు పూర్తి చేయించే బాధ్యత నాది. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. 10 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. ప్రపంచంతో పోటీపడే సత్తా మీకు ఉంది. ఇంకా శానిటేషన్ సిబ్బందికి యంత్రాలు మంజూరు చేస్తాం. నాణ్యమైన భోజనం కూడా అందిస్తాం అని కేటీఆర్ హామీ ఇచ్చారు.

మెస్ కాంట్రాక్ట్‌ మార్పు విషయంలో అధికారులు ఇచ్చిన సమాధానంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం అందించడానికి టెండర్లు పిలవడం అంతరిక్ష సమస్యనా అని ప్రశ్నించారు ఎవరైనా ఓవర్‌యాక్షన్ చేస్తే పోలీసులు సాయం తీసుకోవాలని సూచించారు. పిల్లల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకుండా నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. మిగిలిన విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ ఎప్పటిలోగా అవుతుందని అడిగి తెలుసుకున్నారు.

Exit mobile version