Khammam: ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వేళ ఆయన అనుచరులపై పోస్టర్లు వెలిశాయి. మంత్రి పువ్వాడ అజయ్ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగకపోతే చంపేస్తామని, శవాన్ని దొరకనీయబోమని పొంగులేటి అనుచరుడు మువ్వా విజయ్‌బాబుని హెచ్చరించారు.
ఖబర్దార్ పొంగులేటి..(Khammam)
ఖబర్దార్ పొంగులేటి అంటూ పోస్టర్లపై రాశారు. ఖమ్మం జిల్లా ప్రజలారా ఒక్క క్షణం ఆలోచించండి. మంత్రి పువ్వాడ అజయ్‌పై కావాలని కొంతమంది కుక్కలు చెడు చేయడానికి చూస్తున్నారని పోస్టర్లలో ఆరోపించారు. పొంగులేటి అనుచరులమంటూ కొంతమంది మీడియాలో ప్రచారంకోసం దిగజారుడు పని చేస్తున్నారని, ఇంకో కుక్క చీకటి కార్తీక్‌కి మిస్సయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉండగా ఈ పోస్టర్లపై పొంగులేటి స్పందించారు.
తాను పార్టీ మారినా నష్టం లేదన్న వారు తన అనుచరులను ఎందుకు బెదిరిస్తున్నారంటూ ప్రశ్నించారు. అధికార మదంతోనే బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా అర్దం కాలేదన్నారు. బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా ఖమ్మం సభను విజయవంతం చేస్తామని పొంగులేటి స్పష్టం చేసారు.